పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు

  • మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు
  • రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు పంపించింది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు సిట్ విచారిస్తోంది. బండి భగీరథ్‌‍పై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోవైపు, తనను హనీట్రాప్ చేశారని బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Bandi Bhagirath
Bandi Sanjay
Telangana SIT
POCSO case
Minor girl sexual assault
Revanth Reddy

More Telugu News